ఉద్దవ్ థాక్రేతో చంద్రబాబు ఫోన్...


ఏపీ రాజకీయాలు  కేంద్ర బడ్జెట్ త్వరగా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ చేసిన పనికి మిత్రపక్షమైన టీడీపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇన్నాళ్లూ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం, బడ్జెట్ తరువాత మారిపోయింది. ఇక రేపో, మాపో రెండు పార్టీలు విడిపోవడం ఖాయమన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీలు రాజీనామాకి కూడా సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇటీవల బీజేపీతో విడిపోయిన శివసేన  అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఉద్ధవ్ తో చంద్రబాబు చర్చించిన విషయాన్ని శివసేన వర్గాలు ధ్రువీకరించాయి. ఇక ఉద్దవ్ థాక్రేతో చంద్రబాబు మాట్లాడటంతో పలు కొత్త చర్చలకు దారి తీస్తుంది.