సీఎం లేకుండా గణతంత్ర్య వేడుకలు

దేశ వ్యాప్తంగా 69వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి తోడు రాగా.. గవర్నర్ జాతీయ జెండా ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సీఎం లేకుండానే గణతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకాలేకపోయారు. దావోస్ నుంచి ఆయన బయలుదేరిన విమానం ప్రతికూల వాతవారణం కారణంగా ఇండియాకు రావడం ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటలకు సీఎం అమరావతి రావాల్సి ఉండగా.. సాయంత్రం 4 గంటలకు రాజధానికి చేరుకోనున్నారు. దీంతో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేసి. అక్కడున్న సిబ్బందికి ఆమె మిఠాయిలు పంచి గణతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు.