తొడగొట్టేసిన చంద్రబాబు..
Published on: Sun Jan 31, 2016 12:27PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడు ప్రజలను ఆకర్షించే పనులు చేస్తుంటారు. మొన్ననే ఓ కార్యక్రమంలో చిందేసిన చంద్రబాబు తాజాగా తొడగొట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. విశాఖలో షురూ అయిన ప్రో కబడ్డీ లీగ్ మూడో సీజన్ పోటీల్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తొడ కొట్టేశారు. అంతేకాదు ఆయన తన గతాన్ని కూడా గుర్తుచేసుకన్నారు. తాను చిన్నతనంలో మట్టిలో కబడ్డీ ఆడేవాడినని.. ఇప్పుడు మ్యాట్ మీద ఆడుతున్నానని అన్నారు. మొత్తానికి తెలుగు సినిమాల్లో కామన్ అయిన తొడగట్టడం.. ఇప్పుడు చంద్రబాబు కొట్టేశారు.


