TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ స్వార్థం కోసం మోపిదేవి జైలుకు : చంద్రబాబు

Published on: Thu May 24, 2012 4:14PM

జగన్ స్వార్థం కోసం చాలామంది జైలుకు వెళుతున్నారని చంద్రబాబు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అని కాకుండా తప్పు చేసిన వారందరి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి ఓ బిసి మంత్రిని బలిపశువును చేశాయని మాజీ మంత్రి టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్, కెవిపి రామచంద్ర రావు, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చిన అవినీతి జివోలు క్యాన్సిల్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.