కల్తీసారా ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం:చంద్రబాబు
Published on: Sun Jan 1, 2012 6:22PM
కృష్ణాజిల్లా: తెదేపా అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా మైలవరంలో ఘటన జరిగి 24 గంటలైనా ప్రభుత్వం తరఫున ఒక్కరూ వెళ్లకపోవడం బాధాకరమన్నారు. మైలవరంలో కల్తీసారా ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. మద్యం సిండికేట్ల కుంభకోణంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు కుర్చీ కోసం పోరాడుతున్నారు తప్ప, పాలనను పట్టించుకోవడం లేదని విమర్శించారు.రేపు కృష్ణాజిల్లా మైలవరంలో కల్తీసారా బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు.


