టీడీపీ హయాం..స్వర్ణయుగం: చంద్రబాబు
Published on: Sun Jan 1, 2012 9:48AM
హైదరాబాద్: నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును పలువురు ప్రవాసాంద్రులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తానాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం ఛైర్మన్ మొవ్వా రమేష్, కోట్సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్. నాగార్జునబాబు తదితరులు చంద్రబాబును శనివారం ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలనా కాలాన్ని 'స్వర్ణయుగం'గా అభిర్ణించారు. తెలుగువారి సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తుంది. ప్రవాసాంద్రులు తెలుగువారి అభ్యున్నతికి, ప్రత్యేకించి బడుగుల సంక్షేమానికి సహకరిస్తున్నారు. అప్పట్లో చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు ఎనలేని ఊతమిచ్చారు అని చంద్రబాబు తెలిపారు. తమ హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, ప్రత్యేకించి ఆరోగ్యం, విద్య, ఐటీ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ప్రగతి చోటుచేసుకుందని వెల్లడించారు.


