TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు సార్.. వెంటనే ఈ పని చేయండి సార్!

Published on: Thu Sep 5, 2024 2:31PM

అయ్యా చంద్రబాబు సార్.. ఈ వరదల సహాయక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి వుంది సార్. ఏంటి సార్? ఒకటేంటి, నేను చేయాల్సిన పనులు చాలా వున్నాయని అంటారా... కరెక్టే సార్.. మీరు చేయాల్సిన పనులు చాలా వున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి మీరు వెంటనే చేయాల్సిన పని ఒకటి వుంది సార్. ఏ పని చేసినా చేయకపోయినా ముందు ఆ పని చేయండి సార్.. మీకు పుణ్యం వుంటుంది? ఇంతకీ ఆ పని ఏంటని అంటారా? వస్తున్నా.. అక్కడకే వస్తున్నా.. ఏంటీ.. కొడాలి నానిని డ్రాయర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పడం అనుకుంటున్నారా? కాదండి... ఆ గ్రామసింహం ఎక్కడకి పోతుందిలెండి.. దాని సంగతి తర్వాత చూడొచ్చు. మరేంటి? వల్లభనేని వంశీని లోపలేసి కుమ్మేయడం అనుకుంటున్నారా? లేదండి.. ఆ గుంటనక్క సంగతి తర్వాత ఆలోచించొచ్చు. మరి ఇంకేంటి? జోగి రమేష్‌ని, పేర్ని నాని తదితరులన్ని మడతెట్టేయడం అనుకుంటున్నారా? అబ్బెబ్బె... ఆ పిల్లబచ్చాలు ఎక్కడకి వెళ్తార్లెండి.. వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు.. ఓకే సార్.. అలా చూడమాకండి.. ఇంకా ఎక్కువ సేపు లాగకుండా అసలు విషయం చెప్పేస్తా.. మీరు అర్జెంటుగా టేకప్ చేయాల్సిన పని ఏమిటంటే, ఆ దిక్కుమాలిన రోజా నోరు మూయించండి సార్. ఆ రోజా మీడియా ముందుకు వచ్చి చెత్త వాగుడు వాగుతుంటే రక్తం సలసలా మరిగిపోతోంది సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.. రుషికొండ ప్యాలెస్ అవినీతి వ్యవహారంలోనో, నగరిలో చేసిన అన్యాయాలు అక్రమాల కేసులలోనో రోజాని గంపకింద కోడిని మూసినట్టు మూసేయండి సార్. ఫ్యూచర్లో రోజా తన మునిసిపాలిటీ నోరు తెరవడానికి కూడా భయపడిపోయేలా చేయండి సార్.. చంద్రబాబు గారూ.. రోజాని ఎలిమినేట్ చేయండి సార్!