TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకు  తప్పిన రైలు ప్రమాదం

Published on: Thu Sep 5, 2024 4:47PM

ఎపిలో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులు,  మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం (సెప్టెంబర్ 5)న రైలు ప్రమాదం తప్పింది. 
విజయవాడ మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృట్టిలో ప్రమాదం తప్పింది. బుడమేరు ముంపు  ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లారు.  ముఖ్యమంత్రికి భద్రతా సిబ్బంది వారించినా  వినకుండా ముందుకు సాగిపోయారు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో రైల్వే ట్రాక్ పై  నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా చేరుకుంది.  ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు కొంచెం పక్కకు  తప్పుకున్నారు.  ప్రజల క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు కు పెను ప్రమాదం తప్పటం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు   ఈ హఠాత్‌ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.