సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్.వి.రమణతో సీఎం చంద్రబాబు భేటీ
Published on: Sat Jul 27, 2024 10:40PM

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పరిస్థితుల మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు నాయుడు ముచ్చటించారు.


