రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ
Published on: Wed May 8, 2019 10:54AM

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు వీరిద్దరూ సమాలోచనలు జరిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పు, ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిపై ఇరువురు నేతలకు వచ్చిన నివేదికలపై పరస్పరం చర్చించికున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కోల్‌కతా బయలుదేరి వెళ్లారు.


