చంద్రబాబు జోకర్

 

chandrababu joker, ys sharmila chandrababu,  ys sharmila bus yatra

 

 

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. మొదటి నుండి తెలంగాణలో బలహీనంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటన వస్తుందనగానే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించింది. ఇక ఆ తరువాత నాలుగు రోజులు సమన్యాయం వాదన ఎత్తుకుని ఆ తరువాత సమైక్యాంధ్ర వాదం ఎత్తుకుంది. ఈ మేరకు సమైక్య శంఖారావం యాత్ర మొదలు పెట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది.

 

 

తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూస్తే భయపడేవాడు..అంతే కానీ నేను ఎవరికీ భయపడను అని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టింది. చంద్రబాబును చూసి వైఎస్ ఎప్పుడూ జోకర్ ను చూసినట్టు నవ్వుకునే వారని, కావాలంటే వారి పాత సంభాషణలు, కలిసిన సన్నివేశాలను సాక్షి ఛానల్ లో వేయించి చూయిస్తామని ప్రకటించింది. ఎంత సొంత ఛానల్ ఉంటే మాత్రం పాత సీడీలు వేసి మరీ చూయిస్తామని చెప్పడం ఆశ్చర్యకరం.