కుప్పం నుంచే పోటీ చేస్తా.. కోవర్టులను ఏరిపారేస్తా!
Published on: Thu Jan 6, 2022 3:37PM
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు దేవరాజపురంలో చంద్రబాబు పర్యటించారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇన్ని ఇబ్బందులు, అరాచకాలు ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.
ప్రజలను జగన్‌రెడ్డి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఓటీఎస్ ఎవరూ కట్టొద్దని చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితం చేస్తామని ప్రకటించారు. దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు టీడీపీ అధినేత.
సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు. వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని తెలిపారు. తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదలి పెట్టానని చంద్రబాబు హెచ్చరించారు.పార్టీని ప్రక్షాళన చేస్తానని చెప్పారు. పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోవాలని.. లేదంటే తానే ఏరివేస్తానని స్ఫష్టం చేశారు. ప్రతి పల్లె తిరుగుతా అన్ని ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.


