TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉన్మాదులతో పోరాడాలా?.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి..

Published on: Wed Nov 24, 2021 12:19PM

శాసన సభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని ప్ర‌తిప‌క్ష నేత‌, చంద్రబాబు స‌వాల్ చేశారు. టీడీపీ 22 ఏళ్లు అధికారంలో ఉన్నా తన సతీమణి ఏనాడూ బయటకు రాలేదని.. అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని బాధ‌ప‌డ్డారు. ‘నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్‌ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే బాధపడరా?. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా..? దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. ప్రజల్లోకి వెళ్దాం. ఇది ప్రజాస్వామ్యం.. ఉన్మాదుల స్వామ్యం కాదు. తప్పుడు పనులు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టను. అలిపిరిలో మందుపాతరలకే నేను భయపడలేదు’ అని చంద్రబాబు మండిప‌డ్డారు. 

తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్ర‌బాబు పర్యటించారు. ఎవరూ అధైర్యపడొద్దని భ‌రోసా ఇచ్చారు. ‘వరద ప్రాంతాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడా? వరద బాధితులు చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తారా? అని విమ‌ర్శించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం జగన్‌రెడ్డి గాలిలో తిరుగుతారా? అంటూ నిల‌దీశారు. వరదసాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు.

రౌడీయిజం చేసి కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలిచిందని.. దాన్ని ఇప్పుడు పెద్ద ఇష్యూ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారని.. దొంగ ఓట్లు వేసి దౌర్జన్యంగా గెలిచారని ఆరోపించారు. తాను కంపెనీలు తెస్తే వీళ్లు దందాలు చేస్తున్నారని.. ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా? అని ప్రశ్నించారు. రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించి.. ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.    

‘పోలీసులు వైసీపీకి తొత్తుగా మారారు. నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేసి నిరూపించలేకపోయారు. ప్రశ్నిస్తే నాతో పాటు టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు.. కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తాం. అసెంబ్లీలో మానసికంగా వేధించారు. నా ఇంటిపై.. పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. వైసీపీ నేతలు గంజాయిని డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దు.. టీడీపీ అండగా ఉంటుందని వ‌ర‌ద బాధితుల‌కు చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు.