చంద్రబాబు భూమి కబ్జా!.. అరాచకం పీక్స్...
Published on: Fri Feb 18, 2022 10:15AM
నారా చంద్రబాబు నాయుడు. నారావారి పల్లె. పేరులోనే ఊరుంది. ఊరులో ఉండేదీ నారా వారే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అందులోనూ చంద్రబాబు అంటే ఏమైనా మామూలు వ్యక్తా. 15 ఏళ్ల పాటు సీఎం.. పదేళ్లకు పైగా ప్రతిపక్ష నేత. టీడీపీ అధినేత. అంతటి స్థాయి ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యుల భూమినే కబ్జా చేసేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. ఏకంగా నారావారి పల్లెలోనే భూకబ్జాకు పాల్పడటం.. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం అంటున్నారు.
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు కొందరు ప్రయత్నించారు. సర్వే నంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు వచ్చారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉన్న స్థలంలో.. ఈ భూమి తమదంటూ రాతి స్థంభాలు ఏర్పాటు చేయబోయారు.
1989లో చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత పంపకాల్లో భాగంగా ఆ భూమిని చంద్రబాబు, రామ్మూర్తినాయుడులకు పంచారు. తన వాటాగా వచ్చిన భూమిని ఆస్పత్రి, కల్యాణ మండపానికి చంద్రబాబు డొనేట్ చేశారు. ఇప్పుడు అదే భూమిలో నారా రామ్మూర్తి నాయుడుకు చెందిన 38 సెంట్లలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆ భూమికి సంబంధించి రామ్మూర్తి నాయుడు పేరుపై రిజిస్ట్రేషన్ జరిగినా.. దాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఆ లూప్‌పోల్‌ను వాడుకొని.. ఆ భూమిని కబ్జా చేసేందుకు ట్రై చేస్తున్నారు కొందరు. ఆ కబ్జా వెనుక ఎవరి ప్రోద్బంలం ఉందో వేరే చెప్పనక్కరలేదేమో!!


