TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

Published on: Tue Jun 2, 2026 12:34PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ  సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉభయ తెలుగు రాష్ట్రాల  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతి ఎప్పటికీ ఒక్కటేనన్న ఆయన.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రెండు రాష్ట్రాలు పోటీపడి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

తెలుగు నేలకు గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వం ఉందని పేర్కొన్న చంద్రబాబు భవిష్యత్తులో తెలుగు ప్రజలు మరిన్ని విజయాలు సాధించాలనీ, ఆంధ్రప్రదేశ్ దేశ అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఎదగాలని పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు.