టీడీపీ శాసనసభాపక్షనేతగా చంద్రబాబు ఎన్నిక
Published on: Wed May 29, 2019 12:12PM

టీడీపీ శాసనసభాపక్షనేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
శాసనసభాపక్ష నేతగా ఈసారి చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరదించుతూ.. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు, భవిష్యత్తు కార్యాచరణ, శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.


