బాబుకి మద్దతుగా మమతా బెనర్జీ, నితీష్ కుమార్

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు, మోడీ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెల్సిందే..  సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడిన బాబు, ఏపీకి ప్రత్యేకహోదా మరియు విభజన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందే అంటూ స్పష్టం చేసారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు మాట్లాడిన మాటలకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతుగా నిలిచారు.. బాబు ప్రతిపాదనలకు మమత మద్దతు తెలిపారు.. ఇక నితీష్ ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బాబుకి మద్దతుగా నిలిచారు.. అలానే బీహార్ కి కూడా ప్రత్యేకహోదా కావాలని కోరారు.