TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు ఆరోగ్యం సీరియస్

Published on: Sat Oct 12, 2013 3:18PM

 

 chandrababu deeksha, chandrababu delhi, chandrababu fast,  samaikyandhra chandrababu

 

 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు. అత్యవసర చికిత్స చేపట్టకపోతే బాబు ఆరోగ్యం డేంజర్ జోన్ లో పడే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. తెలుగు ప్రజల డిమాండ్ లను నెరవేర్చే వరకు ఆమరణ దీక్ష విరమించనని... ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం విషమిస్తున్నా ఆయన దీక్ష విరమించేందుకు ససేమిరా అంటున్నారు. వైద్యుల చికిత్సకు ఆయన సహకరించడం లేదు.

 

 

మరోవైపు ఏపీభవన్ నుంచి టీడీపీ అధినేత చ౦ద్రబాబును అక్రమంగా తొలగించినందుకు నిరసనగా శనివారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాస ముట్టడికి టీడీపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది.