TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవి వ‌ల్లే ఓడిపోయాం.. ఇండ‌స్ట్రీ స‌హ‌క‌రించ‌లేదు.. టికెట్ ధ‌ర‌ల‌పై చంద్ర‌బాబు స్పంద‌న‌

Published on: Tue Jan 11, 2022 5:07PM

ఆనాటి ఎన్టీఆర్ నుంచి.. ఈనాటి చంద్ర‌బాబు వ‌ర‌కు.. టీడీపీ అస‌లు ఓడిపోవాల్సిన పార్టీ కానే కాదు. ఎన్టీఆర్ జ‌న‌రంజ‌కంగా పాలించారు. చంద్ర‌బాబు అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప్ర‌పంచ ప‌టంలో నిలిపారు. తెలుగు జాతిని.. నిండుగా వెలుగు జాతిగా మార్చారు. న‌వ్యాంధ్ర‌తో అమ‌రావ‌తి, స‌న్‌రైజ్ స్టేట్ రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌య‌త్నించారు. అయినా, చంద్ర‌బాబు-టీడీపీకి ప‌లుమార్లు ఓట‌ములు త‌ప్ప‌లేదు. వైఎస్సార్ అయినా, జ‌గ‌న్ అయినా.. ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి.. సంక్షేమ ప‌థ‌కాల ఎర వేసి.. అంద‌ల‌మెక్కిన వాళ్లే. వైఎస్సార్ రెండోసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే స‌మ‌యానికి ఆయ‌న‌పై తీవ్ర ప్రజావ్య‌తిరేక‌త ఉంది. జ‌ల‌య‌జ్ఞం పేరుతో సాగించిన ధ‌న‌య‌జ్ఞంపై అంతా ఆగ్ర‌హంతో ఉన్నారు. అందుకే, 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబే మ‌ళ్లీ సీఎం అవుతార‌ని అంతా భావించారు. కానీ, చిరంజీవి రూపంలో టీడీపీకి పెద్ద దెబ్బ త‌గిలింది. ప్ర‌జారాజ్యం పార్టీతో చిరు బాగుప‌డింది ఏమీ లేక‌పోయినా.. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మికి, వైఎస్సార్ గెలుపున‌కు ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేసి.. కేంద్ర మంత్రి ప‌ద‌వి కొట్టేసి.. రాజ‌కీయాల నుంచి రిటైర్ అయ్యారు. చిరంజీవి ఆ రోజు ఆ త‌ప్పిదం చేయ‌క‌పోయి ఉంటే.. బ‌హుషా ఆనాడే చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయ్యే వారని అంటారు.

తాజాగా, ఆనాటి ఎపిసోడ్‌ను గుర్తు చేసుకుంటూ.. చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని.. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉంటారని చంద్ర‌బాబు చెప్పారు. 

సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప‌రోక్షంగా సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై చంద్ర‌బాబు స్పందిస్తూ.. ఇలా గ‌తాన్ని గుర్తుచేస్తూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.