భువనేశ్వరి కోసం చీర కొన్న చంద్రబాబు!
Published on: Wed Aug 7, 2024 5:34PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తన భార్య భువనేశ్వరికి చీరలు కొనేది తక్కువ. గతంలో ఒకసారి ఆయన భార్య కోసం చీర కొన్నారు. అయితే ఆ చీర భువనేశ్వరికి నచ్చకపోయినా, తన భర్త కొన్న చీరను ఆమె చాలా ఇష్టంగా దాచుకున్నారు. ఈ విషయాన్ని భువనేశ్వరే స్వయంగా ఒకసారి చెప్పారు. చంద్రబాబు నుంచి మంచి చీర సెలక్షన్ ఆశించడం న్యాయం కాదు కదా.. అయినప్పటికీ, చంద్రబాబు తన భార్య కోసం మరోసారి చీర కొన్నారు. చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద చీరలు చూసి, ఒక చీర కొనుగోలు చేశారు. వివిధ రకాల చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకున్నారు. మరి చంద్రబాబు కొన్న చీర ఇప్పుడైనా భువనేశ్వరికి నచ్చుతుందో... లేదో!


