TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 19 కి వాయిదా

Published on: Fri Sep 15, 2023 1:13PM

మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుకు ఈరోజు కూడా ఊరట లభించలేదు.విజయవాడలోని ఏసీబీ కోర్టులో  ఆయన దరఖాస్తు చేసుకున్న  బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. విచారణను ఈ నెల 19వ తేదీకి  వాయిదా వేసింది. కౌంటర్ వేయడానికి సీఐడీ న్యాయవాది గడువు కోరడంతో... 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్ పై ప్రభావం పడుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.చంద్రబాబు బెయిల్ పిటిషన్ గూర్చి దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. పలువురు టీవీలకు అతుక్కుపోయారు. జాతీయ మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది.