TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘనంగా 'తెలుగు వన్' ఎండీ కుమార్తె పెళ్లి.. చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖుల హాజరు

Published on: Wed Aug 17, 2022 12:07PM

తెలుగు వన్ సంస్థల అధినేత కంఠంనేని రవిశంకర్ కుమార్తె జితేష్ణ వివాహం సాయిరామ్ సోహిల్ తో శనివారం(ఆగస్టు 13) సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార, వైద్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

 

 

కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా హాజరయ్యారు. అలాగే సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ సుజనా చౌదరితోపాటు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సింగీతం శ్రీనివాసరావు, ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, వై.వి. ఎస్. చౌదరి, నీలకంఠ, వీరశంకర్, వి.ఎన్. ఆదిత్య, రవిబాబు, భానుశంకర్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్, నటులు వినోద్ కుమార్, శివాజీ, రాజీవ్ కనకాల, రచయితలు జనార్దన మహర్షి, నివాస్ తదితరులు హాజరయ్యారు.