TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణమ్మకు చంద్రబాబు పలకరింత.. పులకరింత!

Published on: Wed Aug 7, 2024 6:23PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణానదిని పలకరించారు.. ఆ నదీమతల్లిని చూసి ఆయన పులకరించారు. విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి చంద్రబాబు కిందకు దిగారు. బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పరవళ్లను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారున. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను చంద్రబాబు దగ్గరకు పిలిచి మాట్లాడారు. కృష్ణమ్మ జలకళ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో  సంతృప్తిగా ఉందంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.