వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి తప్పు చేసారా...!

 

ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ ఏం చేసిందనేది కాసేపు పక్కనపెడితే, ప్రత్యేకహోదా సాధించనందుకు ప్రజలు బాధపడుతున్నారనేది వాస్తవం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేసింది.. బీజేపీ ప్రత్యేకహోదాకి బదులుగా అంతే సమానమైన ప్రత్యేకప్యాకేజీ ఇస్తానంది.. దానికీ టీడీపీ అంగీకరించింది.. కానీ బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా వెనకడుగు వేస్తుండటంతో.. టీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకొని ప్రత్యేకహోదాకి పట్టుపట్టింది..

ఇప్పటికీ టీడీపీ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. మరోవైపు ఏపీ విపక్ష పార్టీ వైసీపీ, ప్రత్యేకహోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల చేత రాజీనామా చేయించింది.. అయితే రాజీనామాల వల్ల ఉపయోగం లేదని, వైసీపీ రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతుందని విమర్శలు వినిపించాయి.. రాజీనామాల విషయంలో వైసీపీ నిర్ణయం తప్పని పార్లమెంట్ సాక్షిగా నిరూపించే అవకాశం టీడీపీకి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 10వరకు మొత్తం 18 రోజులు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగా టీడీపీ, బీజేపీ ని నిలదీయాలని చూస్తుంది.. అవసరమైతే బీజేపీ మీద అవిశ్వాసతీర్మానం పెట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది.. కానీ వైసీపీకి ఆ అవకాశం లేదు.. ఎంపీల రాజీనామా వల్ల పార్లమెంట్లో రాష్ట్రం కోసం పోరాడే అవకాశం కోల్పోయింది.. మరో వైపు ఉపఎన్నికలకు కూడా ఆస్కారం లేదు.. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. అలానే టీడీపీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద పోరాడితే.. వైసీపీ నిర్ణయం తప్పని ప్రజలకి అర్ధమవుతుంది అంటున్నారు.