TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్‌రెడ్డి అహంకారం ప్ర‌జ‌ల‌కు శాపం.. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌పై చంద్రాగ్ర‌హం

Published on: Thu Nov 25, 2021 9:57AM

సీఎం జగన్‌రెడ్డి అహంకారం, అనుభ‌వరాహిత్యం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

ఇలాంటి సమంయలోనే ప్రభుత్వ సమర్థత ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని.. సమర్థతతో పనిచేయాలని హితవుపలికారు. సమర్థతతో వ్యవహరిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు తెలిపారు. 

పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులపై ప్ర‌జ‌ల‌ను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని చంద్ర‌బాబు ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌కు గేట్లు పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారన్నారు. మృతదేహం కూడా దొరకలేదంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆగ్రహం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. 

ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఖర్చులకు చందాలిచ్చిన ఉద్యోగులు.. ఏపీలో విడ్డూరం..