TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతులకుఏరువాక శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Published on: Mon Jun 29, 2026 2:15PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు.  వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ..  దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేసిన నారా చంద్రబాబు..  రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన పండుగ  రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.  ఎల్ నినో కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలనీ,  ప్రకృతి సాగుతో పంటలు పండించి,  భూమిని,  ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని  ఆయన పేర్కొన్నారు.   

అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలోని రైతు సోదరులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన జరుపుకునే ఈ పండుగ.. భూమాతకు, పశుసంపదకు గౌరవం ఇస్తూ..  ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటుతుందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.    

సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, తద్వారా అన్నదాతలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తునని పేర్కొన్న పవన్ కల్యాణ్..  రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా ఇప్పటికే  పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' పథకం మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.