TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంపుప్రాంతాల్లో  చంద్రబాబు ఏరియల్ సర్వే 

Published on: Fri Sep 6, 2024 4:44PM

భారీ వర్షాల వల్ల ఎపి అతలాకుతలమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. నిన్న బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రికి  తృటిలో రైలు ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.  
 కాగా ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. . బుడమేరు కొల్లేరులో కలిసే ప్రక్రియను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు కబ్జా అయిన వైనాన్ని చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజి నీళ్లు  కృష్ణానదిలో కలిసే తీరు , అక్కడ్నుంచి సముద్రంలో కలిసే తీరు చంద్రబాబు ఏరియల్ సర్వేలో తెలుసుకున్నారు.