దానికి మోడీయే కారణం...నాకు తెలుసు ఎలా సాధించుకోవాలో..


ఏపీ ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. కానీ అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాలేదు. అన్నాడీఎంకే పార్టీని అడ్డుపెట్టుకొని మోడీ ప్రభుత్వం చర్చ జరగకుండా డ్రామాలాడింది. ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసినా ఇంకా ఎంపీలందరూ నిరసన చేస్తూనే ఉన్నారనుకోండి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... విపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరగనీయకపోవడాన్ని నిరసిస్తూ మోడీ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నా అని ప్రకటింటారు. ఇక ఇప్పుడు మోడీ చేస్తానంటున్న ఒక్క రోజు నిరాహార దీక్ష పై  చంద్రబాబునాయుడు స్పందించి ఆయనపై విమర్సలు గుప్పించారు. అమరావతిలో జరిగిన ఆనంద నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చిన విందు సమయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటు సజావుగా సాగకపోవడానికి ఎన్డీయేనే కారణమని ఆయన ఆరోపించారు.

 

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే పార్టీ వెనుక ఉండి లోక్‌సభ జరగనీయకుండా చేసింది ఎన్డీయే కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాన్ని ఏర్పాటు చేయకుండా మోదీని ఎవరు ఆపారు’ అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు జరగకపోవడంపై తప్పు తమ వైపు పెట్టుకుని ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.. కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.