మరోసారి రాజకీయ చాణక్యాన్ని చూపించారుగా...!

 

మరోసారి చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని చూపించారు. తన రాజకీయానుభవం ముందు జగన్ మరోసారి బోల్తాపడ్డాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిన్న వైపీసీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక టీడీపీ కూడా వైసీపీకీ మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడే చంద్రబాబు నైట్ కి నైటే తన చక్రాన్ని తిప్పేశారు. వైసీపీలో ఉంది ఐదుగురు.. ఐదుగురితో కలిసి వెళ్లేదేంటి.. మనమే స్వయంగా అవిశ్వాస తిర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక చంద్రబాబు నిర్ణయంతో ఈరోజు టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ముందు పెట్టిన వైసీపీ నేతలు అవిశ్వాసం ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే...అవిశ్వాసం అవిశ్వాసం అంటూ వైసీపీ నెలరోజులుగా డ్రామా చేస్తున్నా ఆ పార్టీకి ఎంత మద్దతు దక్కుతుందన్నది వారికే అర్థం కాని పరిస్థితి.

 

కానీ టీడీపీ పరిస్థితి అలా కాదు. టీడీపీ తీర్మానం మాత్రం కలకలం రేపే అవకాశాలే కనిపిస్తున్నాయి. కారణం చంద్రబాబు. ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. చంద్రబాబు రంగంలోకి దిగడంతో  టీడీపీ తీర్మానానికి జాతీయ పార్టీలు మద్దతిచ్చేందుకు క్యూ కట్టాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుండి అన్నాడీఎంకే.. ఇక మమతాబెనర్జీ, లెఫ్ట్ పార్టీలు కూడా బాబు తీర్మానానికి మద్దతిస్తామని చెప్పినట్లు సమాచారం. శివసేన ఎలాగూ కేంద్రంపై మండిపడుతోంది. శివసేన, అకాళీదల్ తమ వైఖరిని చెప్పనప్పటికీ అవిశ్వాసానికి సై అనొచ్చంటున్నారు. కాంగ్రెస్ తోనే ఆర్జేడీ నడవొచ్చు. అంటే ఓ రకంగా జాతీయ పార్టీల్లో చాలావరకూ టీడీపీకి మద్దతిస్తున్నట్లే. దీంతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని టీడీపీ మరోసారి జాతీయ స్థాయిలో వివరించే అవకాశం దక్కుతుంది. మొత్తానికి వైసీపీ మద్దతిచ్చి ఆ క్రెడిట్ వైసీపీకి దక్కకుండా జాగ్రత్తపడ్డారు. మరోసారి చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు  రాజకీయం ఏంటో చూపించారు.