TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సారీ చెప్పిన బాబు.. షాక్ తిన్న కామన్ మ్యాన్..

Published on: Tue Jan 16, 2018 1:09PM

 

ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగకు ఆయన సొంతవూరు నారావారిపల్లె వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అక్కడే కుటుంబసమేతంగా ఆయన పండుగను చేసుకుంటున్నారు. దీంతో అక్కడి చుట్టుపక్కల గ్రామాల నుండి చంద్రబాబు బంధువులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో..ఊరంతా రద్దీగా మారింది. ఇక ఈసమస్యను ముందుగానే ఊహించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది.

 

పోలీసులు నారావారిపల్లెకు వచ్చే, వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ని డైవర్ట్ చేశారు. ఈ ట్రాఫిక్ డైవెర్షన్ వల్ల స్థానికులకు కొద్దిగా ఇబ్బంది తలెత్తింది. దీనిలో భాగంగా...నవీన్ అనే అతను కుటుంబ సభ్యులతో పాటుగా ఊరికి బయలుదేరాడు. ట్రాఫిక్ డైవర్షన్ తో ఆయనకు చికాకు వచ్చింది. ప్రయాణం ఆలస్యం అవుతుందన్న కోపంలో అతను చంద్రబాబు రక్షణ సిబ్బందిని నిలదీసాడు. తాము ఎందుకు ఇబ్బంది పడాలని వారితో వాగ్వాదానికి దిగాడు. ఇక ఈ విషయం ఆఖరికి చంద్రబాబుకు చేరింది. దాంతో ఆయన నవీన్ ని పిలిపించి...కలిగిన ఇబ్బందికి సారీ చెప్పారట. అంతే ఏదో ఊహించుకొని అక్కడికి వెళ్లిన నవీన్... చంద్రబాబు సారీ చెప్పడంతో తిన్నాడట. సీఎం గారు కదా.. ఏమన్నా అంటారేమో... సీఎం అన్న అధికారం చూపిస్తారేమో అని అనుకుంటే ఇలా సారీ చెప్పేసరికి నవీన్ ఖంగుతిన్నాడట. అంతేకాదు తన తొందరపాటుకు తిరిగి సారీ చెప్పడమే కాకుండా తానే సర్దుకుపోయి ఉంటే బాగుండేది అన్నాడంట. మొత్తానికి సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యింది. చంద్రబాబు ఏ మాత్రం భేషజానికి పోకుండా సారీ చెప్పడం చూసి నారావారిపల్లె వాసులు అందుకే మా వూరి నాయకుడు గొప్పవాడని చెప్పుకుని మురిసిపోతున్నారు. మరి ఒక సీఎం అన్నఅధికారం ఎక్కడా చూపించకుండా.. ఇలా తన వల్ల కలిగిన ఇబ్బందికి సారీ చెప్పడం గొప్ప విషయమే.