బాబుగారు ఏమన్నా వాడుతున్నారా..?

 

అధికారుల చేత పనులు ఎలా చేయించుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. అందుకే సమర్ధవంతమైన అధికారులు రిటైర్డ్ అయినా వారికి ఏదో ఒక బాధ్యతలు అప్పగిస్తూనే ఉంటారు. వారిచేత రాష్ట్రానికి సేవలు చేయించుకుంటారు. ఈ జాబితాలో నండూరి సాంబశివరావు కూడా చేరిపోయారు. ఆయన్నికూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. డీజీపీగా సేవలు అందించిన నండూరి సాంబశివరావు ఇటీవలే రిటైర్డ్ అయిన సంగతి తెలిసిందే కదా. అలా రిటైర్డ్ అయ్యారో లేదో.. అప్పుడే చంద్రబాబు ఆయనకు  కొత్త పోస్ట్ ఇచ్చారు... విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నండూరి సాంబశివరావుని నియమించారు.


సాంబశివరావుకి, విశాఖకు ఎక్కువ అనుబంధం ఉంది. గతంలో ఇక్కడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. విశాఖలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసి పోలీసులు ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించారు. అనంతరం ఆయన రాష్ట్ర ఆర్టీసీ ఎండిగా కూడా బాధ్యతలు చేపట్టి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేసారు. తరువాత ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా రాష్ట్ర ప్రజలకి విశేష సేవలందించి ప్రభుత్వంచే మన్ననలు పొందారు. పదవీ విరమణ అనంతంర ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పడైనా తన సేవలను స్వీకరించవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ఎలాంటి సేవలు చేసేందుకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేసారు. ఇంకేముంది సాంబశివరావు గారు అలా చెప్పారో లేదో... చంద్రబాబు ఇలా కంటిన్యూ అయిపోయారు. తనకో పదవి ఇచ్చేసి కూర్చోబెట్టారు. ఇక సందర్భంగా ఆయన మాట్లాడుతు.. గతంలో విశాఖతో ఏంతో అనుబంధం ఉన్న నాకు తిరిగి ఇక్కడకే రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని...నా సేవలు గంగవరం పోర్టుకు ఎంతో అవసరమని తెలిపారు. మొత్తానికి చంద్రబాబు అందర్ని వాడుతున్నారుగా...