చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తలు.. నా గొప్పతనం కాదు.. చంద్రబాబుది..

 

మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవడం కంటే... పక్కన వాళ్లు చెప్పుకొని పొగిడితేనే అందులో అర్ధం ఉంటుంది. అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో నిజమైంది. చంద్రబాబు గొప్పతనాన్ని పొగిడారు. అది ఎవరో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆరే ఎకంగా చంద్రబాబు గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా...? హైటెక్ సిటీ విషయంలో..

 

హైటెక్ సిటీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే హైటెక్ సిటీ అని చెప్పుకునేవారు ఒకప్పుడు. చెప్పుకోవడం కాదు కానీ.. ఓ రకంగా హైటెక్ సిటీ డెవలెప్ మెంట్ కు చంద్రబాబు బాగానే కష్టపడ్డారు. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందంటే అది చంద్రబాబు చలవే అని చెప్పొచ్చు. ఒక్క హైటెక్ సిటీనే కాదు... ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా.. నా వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని.. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కేవలం తాను, టీడీపీ ప్రభుత్వాలే కారణమని.. హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టింది తమ హయంలోనేనని... ఎయిర్ పోర్టు నిర్మాణం, రహదారుల అభివృద్ధి, రింగ్ రోడ్ ఇవన్నీ తనే చేశానని... హైదరాబాద్ ప్రపంచపటంలో నిలిపామని చెబుతుండేవారు. అది నిజమే అయినప్పటికీ.. ఆయనపై విమర్శలు కూడా వస్తుంటాయి.

 

కానీ ఈసారి మాత్రం చంద్రబాబు గొప్పతనాన్ని కేటీఆరే స్వయంగా ఒప్పుకోవడంతో అందరూ షాకవుతున్నారు.  హైటెక్స్‌ సిటీలోటెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని.. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చంద్రబాబు గొప్పతనం ఇన్ని రోజులకు బయటకు చెప్పారు కేటీఆర్. చంద్రబాబును పక్క రాష్ట్రంలో మెచ్చుకోవడం గొప్ప విషయమే మరి. ఏది ఏమైనా కేటీఆర్ మాటలకు చంద్రబాబు హ్యాపీగా ఫీలవుతారేమో...