TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కు అర్ధం కాదు.. జగన్ అర్ధం చేసుకోడు..

Published on: Tue Dec 12, 2017 11:10AM

 

ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ సామెత గుర్తుంది కదా... ఇక్కడ దెబ్బ కొట్టింది ఎవరంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇక రెండు పిట్టలు ఎవరో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటది.. ఆ పిట్టలు ఎవరో కాదు... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? పోలవరం ప్రాజెక్ట్ విషయంలో..

 

పవన్ కళ్యాణ్ ఏపీలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా... పోలవరాన్ని కూడా సందర్శించిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో, పార్టీదో కాదని.. ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని.. పోలవరం విషయంలో తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. పోలవరం పూర్తి కాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం లెక్కలు అడుగుతోందని అవి చెబితే తప్పేమిటని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని అనుమానాలు వచ్చాయని, దాంతో లెక్కలు అడుగుతున్నారని, మనం ఏ తప్పు చేయనప్పుడు లెక్కలు చెబితే తప్పేమిటని అన్నారు. ఇక జగన్ అయితే ఎప్పటినుండో పోలవరం విషయంలో చంద్రబాబును విమర్శిస్తూనే ఉన్నాడు. ప్రాజెక్టు అని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని.. అబ్పో ఎన్నో విమర్సలు చేశాడు.

 

అయితే ఇప్పుడు వారి కామెంట్లకు చంద్రబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం పనులు పరిశీలించడానికి వచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో పాల్గొని.. జగన్, పవన్ విమర్శల గురించి స్పందిస్తూ నవ్వుతూనే షాకులిచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఏం చెప్పినా పూర్తిగా అర్థం కాదు.. ఇక వైఎస్ జగన్ చెప్పినా అర్థం చేసుకోరు అంటూ కామెంట్ చేశారు చంద్రబాబు. వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే ముందు దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది..ఎందుకంటే అది ఇప్పటి ప్రాజెక్టు కాదు..అంతే కాదు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయో అన్న విషయం కూడా ఆ ఇద్దరు గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందని అన్నారు.

 

మొత్తానికి హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు.. రాజకీయాల్లోనే చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ముందా పవన్, జగన్ కుప్పి గంతులు. ఏదో కేంద్రం సహకరించినా... సహకరించకపోయినా.. నానా కష్టాలు పడుతూ... ఏదోలాగ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తుంటే... కేంద్రంపై పోరాడి.. ఆయనకు సహకరించాల్సింది పోయి.. రివర్స్ లో ఆయపైనే కౌంటర్లు వేయడం. మరి ఇవన్ని చూస్తూ చంద్రబాబు ఊరుకుంటారా.. రివర్స్ కౌంటర్ ఇచ్చి నోరు మూయించారు.