చంద్రబాబు దేశాలన్నీ తిరిగి రాజమౌళి దగ్గరకు వచ్చాడు
Published on: Thu May 31, 2018 11:56AM

బీజేపీకి టీడీపికి చెడిన తర్వాత మాటల యుద్ధం కోటలు దాటేస్తోంది. నిన్న జరగిన మహానాడులో టీడీపి నేతలంతా బీజేపీ మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే! దీనికి ప్రతీకారంగానో ఏమో.... బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపిని ఏకిపారేశారు. చంద్రబాబు తడవకో తీరుగా ప్రవర్తించడం చూస్తే, ఆయనలో ఓ అపరిచితుడు ఉన్నాడేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. రాజధాని ప్లాన్ కోసం 16 దేశాలు తిరిగి చివరికి రాజమౌళి చెంతకు చేరారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీని తిడితే సహించేది లేదని టీడీపికి ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి దీనికి టీడీపి స్పందన ఎలా ఉంటుందో చూడాలి!


