ముగిసిన.. ఆళ్లగడ్డ పంచాయితీ.. అఖిలప్రియకు క్లాస్...
Published on: Fri Apr 27, 2018 6:37PM
.jpeg.jpg)
మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య జరుగుతున్న వార్ అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి చర్యలపై స్పందించిన చంద్రబాబు వారిద్దరిని పిలిపించి సంగతి కూడా విదితమే. ఈ సందర్బంగా చంద్రబాబు వీరిద్దరికి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో విడివిడిగా, ఉమ్మడిగానూ చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా అఖిల ప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారని, అలాగే ఆయన కుమార్తె కూడా తనపై విమర్శలు చేశారని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారట. మరోవైపు.. ఏవీ సుబ్బారెడ్డి.. చంద్రబాబు ముందు రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను ఉంచారు. విషయంపై అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి అన్నారట. దీంతో సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలుపుతూ అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట. అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు చెప్పారట. మొత్తానికి ఈరకంగా ఆళ్లగళ్ల రాళ్లదాడి పంచాయితీ ముగిసింది.


