TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జైట్లీ ఏమో అవమానిస్తారు.... నీచంగా కనిపిస్తున్నామా..?

Published on: Sat Mar 24, 2018 5:42PM

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాయగా... దానికి చంద్రబాబు గట్టిగానే సమాధానమిచ్చారు. తెలుగువారిని అవమానిస్తూ అమిత్ షా లేఖ రాశారని అన్నారు. అమిత్ షా లేఖలోని విషయాలు అన్నీ కట్టుకథలు, అర్ధసత్యాలని... ఉన్నతస్థాయిలోని వ్యక్తులు అబద్దాలు చెప్పకూడదని మండిపడ్డారు. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం వద్ద, రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయని, వాటిని బేరీజు వేస్తూ ఇవి చేశాం, ఇవి చేయలేదు, చేస్తామని చెప్తే బాగుండేదని.. అలా కాకుండా... ఇచ్చిన నిధులను వాడుకోవడం లేదని అంటున్నారని, మనలను అసమర్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు జైట్లీ ఏమో అవమానకరంగా జైట్లీ మాట్లాడుతున్నారు..యుద్ధానికి వాడే నిధులను మనం అడుగుతున్నామా, ఎపి ప్రజలు అంత నీచంగా కనిపిస్తున్నారా అని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని జైట్లీ చెప్పారని, కానీ అమలు చేయలేదని ఆయన అన్నారు.