నాకు తెలిసింది... పోలవరం ఆపేస్తారు..!

 

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీ టార్గెట్ గా విమర్శలు స్టార్ట్ చేశారో అప్పటినుండి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోయారు జనాలు. టీడీపీ ఏమో బీజేపీ, జనసేన, బీజేపీ కలిసిపోయింది అని అంటుంటే.. మరోపక్క నేను ఎవరితో కలవను నారూటు సెపరేటు.. అంటారు. కానీ సందు దొరికినప్పుడల్లా టీడీపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బహిరంగంగానే చంద్రబాబు, లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో పవన్ పై తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. అందుకే పవన్ పై కూడా ఎదురు దాడికి దిగాలని చంద్రబాబు  తమ నేతలకు చెప్పడం జరిగింది. అంతేకాదు బాబు కూడా పవన్ పై తీవ్ర స్థాయిలోనే మండిపడ్డారు. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా పోలవరంపై కూడా చర్చలు మొదలయ్యాయి. పోలవరంపై అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు అంటుంటే...ఏం లేదు మొర్రో అని అధికార పార్టీ నేతలు మొత్తుకుంటున్నారు. దీనిలో భాగంగానే పోలవరంపై ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

 

ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు... పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని తనకు తెలిసిందని, సీబీఐ ఎంక్వయిరీలంటూ వైసీపీ, జనసేనతో ఆరోపణలు చేయించి, విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలన్నది బీజేపీ ఉద్దేశమని ఆరోపించారు. నదుల అనుసంధానానికి కీలకమైన పట్టిసీమపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతోనే పోలవరం నిర్మిస్తున్నామని, రాష్ట్రం నిర్మిస్తే మరింత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావించిన మీదటే, నిర్మాణ బాధ్యతలను తాను నెత్తిన వేసుకున్నానని అన్నారు. మరి చంద్రబాబుకే తెలిసిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు రోజుకో ట్విస్ట్ తో రోజుకో మలుపు తిరుతున్నాయి. మరి నిజంగానే పోలవరాన్ని ఆపుతారా... లేక ఇవన్నీ పుకార్లేనా.. చూద్దాం ఏం జరుగుతుందో...