సస్పెండ్ చేసినా ఫర్వాలేదు...


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో టీడీపీ ఎంపీలంతా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గత వారం రోజుల నుండి పార్లమెంట్లో తమ నిరసనను తెలుపుతూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు చేస్తున్న నిరసనలను ఇంకా కొనసాగించాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఆయన ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఎంపీలు ఎవరకూ నిశబ్ధంగా కూర్చోవద్దని, కలసికట్టుగా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలిపేలా నిరసనలు చేపట్టాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రావాల్సిన నిధుల వివరాలతో పాటు యూసీలు, డీపీఆర్ లన్నీ ఆన్ లైన్లో అందుబాటులో ఉంచామని, వాటిని ఎంపీలు వాడుకోవాలని అన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా ఫర్వాలేదని, బయటకు వచ్చి మరింత ఉద్ధృతంగా పోరావడాలని అన్నారు. ఏ పార్లమెంట్ లో అయితే ఏపీకి అన్యాయం జరిగిందో, అదే పార్లమెంట్ లో రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారట.