నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా.. చంద్రబాబు సలహా...!

 

మంచిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా... బయట కాసేపు తిరిగి గట్టిగా అరిచి ఇంటికి వెళ్లి పడుకుంటే మంచిగా నిద్ర పడుతుందట. ఇంతకీ ఈ విషయం చెప్పింది ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు  'పలకరింపు' పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాుడుతూ... ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా రోజులో కాసేపు బయట తిరగాలని, ఆ సమయంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని అన్నారు. అంతేకాదు...ప్రతి ఒక్కరూ కాసేపైనా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే 'హ్యాపీ సండే' కార్యక్రమానికి రూపకల్పన చేశానని, రోడ్లపై డ్యాన్సులు వేస్తుంటే చూసి ఆనందింవచ్చని అన్నారు. బయటకు వచ్చి కాసేపు గట్టిగా అరచి ఆపై ఇంటికి వెళితే, ఉత్సాహంగా ఉంటుందని, రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుందని చెప్పారు. బంగారం, వజ్రాలను ధరిస్తే ఆనందం రాదని, ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టేనని అన్నారు.