సస్పెండ్ చేసినా ఫర్వాలేదు.. వెనక్కి తగ్గొద్దు..

 

టీడీపీ ఎంపీలు గత నాలుగురోజుల నుండి పార్లమెంట్ ఉభయసభల్లో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయినా కేంద్ర పెద్దలు మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మొన్న ప్రసంగం చేసిన మోడీ కాంగ్రెస్ ను తిట్టడమే సరిపోయింది కానీ... ఏపీకి ఏం చేస్తామన్నది మాత్రం సెలవివ్వలేదు. పోనీ నిన్న మాట్లాడిన జైట్లీ అయిన ఏదో ఒకటి చెబుతారనుకుంటే ఆయనే కూడా  ఒక్క 15 నిమషాలు మీరు ఓపిక పట్టండి అంటూ, మీ గురించే చెప్తాను నాకు టైం ఇవ్వండి అంటూ ఏపీకి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు కానీ కొద్దిగా భారం తగ్గితే ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందని.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం పాత పాటే పాడారు. ఇక నిన్న జైట్లీ మాటలకు ఏపీ ఇంకా మండిపోతుంది. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్నటి జైట్లీ ప్రసంగం ఏ మాత్రం ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు నిరసనలను నేడు మరింత ఉద్ధృతం చేయాలని తన పార్టీ ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారట. పార్లమెంట్ ప్రారంభం కాగానే, సభలో ఉండే ఆందోళన సాగించాలని, మరింతగా నిరసన తెలపాలని సూచించిన ఆయన, సస్పెండ్ చేసినా ఫర్వాలేదని... సభ్యులను సస్పెండ్ చేస్తే, పార్లమెంట్ బయట ఆందోళన కొనసాగించాలని అన్నారట. నేటి సాయంత్రం వరకూ కేంద్రం నుంచి ఏదైనా సానుకూల స్పందన వస్తుందేమో వేచి చూద్దామని చెప్పారు. సభ వాయిదా పడిన తరువాత అందరు ఎంపీలతో అమరావతిలో సమావేశం నిర్వహిస్తానని, తదుపరి విషయాలు అక్కడ చర్చించుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో..