మా దారి మేం చూసుకుంటాం...

 

బీజేపీ నేతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలైనప్పటికీ గత కొద్దిరోజుల నుండి ఈ రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు, టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించడం...దానికి టీడీపీ నేతలు కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి ఒక్కోసారి టీడీపీ నేతలను చంద్రబాబు వారించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఏకంగా చంద్రబాబుకే కోపమొచ్చినట్టుంది. అందుకే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ పర్యటనకు సంబంధించిన.. విశేషాలు చెప్తూ, ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబునాయుడు స్పందించారు. ‘బిజెపి నేతలు ఎన్ని మాట్లాడినా, నేను మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నా... మా వాళ్ళు హద్దు మీరుతుంటే హెచ్చరిస్తున్నా.... వారు మాత్రం అలా కాదు...వాళ్లు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం... అని అన్నారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.