జన్మభూమిపై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తలు...


ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత కానీ.. ఆ పార్టీ నేతలు కానీ.. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... ఏపీ ప్రభుత్వంపై.. ముఖ్యంగా చంద్రబాబుపై ఎప్పుడు విమర్శలు గుప్పిద్దామా అని చూస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం విచిత్రంగా టీడీపీపై ప్రశంసలు కురిపించారు. అసలు సంగతేంటంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో నిన్న ‘జన్మభూమి-మాఊరు’ పేరుతో నవక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఒకపక్క వైసీపీ నేతలు...  అడ్డగోలు ఖర్చులు చేస్తున్నారని..ప్రజలకు ఈ కార్యక్రమాలు అస్సలు పనికి రావాని పెదవి విరుస్తున్నారు. కానీ సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాత్రం..  ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం చాలా మంచిది అని అన్నారు. అంతేకాదు పార్టీలు ముఖ్యం కాదు..ప్రజా సంక్షేమం ముఖ్యం అంటూ.. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బహిష్కరించినా ఆయన మాత్రం జన్మభూమిలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఐదో జన్మభూమి అన్నారు. వృద్ధులు, వితంతు, దివ్యాంగులకు పింఛన్లు, రేషన్‌ కార్డులు అందజేశారని, అయితే ఇంకారాని వారు ఎందరో ఉన్నారని వారందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం తనకి ఉందని చెప్పారు. మరి పార్టీలకు అతీతంగా ఓ ప్రతిపక్ష నేత ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం.. నిజంగా మెచ్చుకోదగినదే. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి..