TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నోటుకు ఓటులో చంద్రబాబుకి నోటీసులు..అవన్నీ కామన్...

Published on: Mon Mar 6, 2017 1:55PM

 

ఓటుకు నోటు కేసులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ నోటీసులపై స్పందించిన చంద్రబాబు.. కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని... ఇందులో కొత్తేమీ లేదని అన్నారు. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అసలు ఓటుకు నోటు కేసులో ఏమీ లేదని అన్నారు. ఇప్పటి వరకు తనపై 26 కేసులు వేశారని... ఏదీ నిలబడలేదని చెప్పారు.

 

కాగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన సుప్రీం కోర్టుఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.