చంద్రబాబు ముందుచూపు అదిరిందిగా...!

 

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీ గురించి తగు జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇప్పటికే మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ-బీజేపీల మధ్య విబేధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బహిరంగానే అవి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మే నెల వరకూ గడువు తీసుకున్నట్టు తెలుస్తోంది

 

నిజానికి అవ్వడానికి మిత్రపక్షమైనా మోడీ ఏపీకి చేసింది పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. చంద్రబాబు కేంద్రం చుట్టూ తిరగి.. తిరిగి... వాళ్లని అడిగి అడిగి సాయం చేయండయ్యా బాబు అంటే ఆ మాత్రం నిధులన్నా ఇచ్చారు. నిజానికి కేంద్రం విషయంలో చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నట్టే. నాలుగేళ్ల సమయం ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. నాలుగేళ్లే ఇచ్చారు.. ఇంకా ఈ నాలుగు నెలలు ఇవ్వడం పెద్ద మేటర్ ఏంకాదు. అంతకన్నా ఎక్కువ టైం ఇచ్చినా టీడీపీకే నష్టం. ఎందుకంటే ఇంకా ఎదురుచూపులు చూస్తే జనం టీడీపీని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు కూడా కావాలనే టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేకపోతే..

 

అసలు సంగతేంటంటే.. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అయితే మే నెలలోపు  కర్ణాటకతో పాటు మరో మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఉన్న సామర్ధ్యం ఏంటో.. బీజేపీ భవితవ్యం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మే నెలలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని చంద్రబాబు ఆలోచన అని రాజకీయ విశ్లేషకుల మాట. బీజేపీతో ఇప్పుడే తెగతెంపులు చేసుకుంటే.. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉంటే.. రాష్ట్రానికి అందుతున్న ఈ పాటి సాయం కూడా అందదని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఫలితాలు అటూ ఇటూ అయి.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. టీడీపీ బయటకు వస్తుంది. మరి టీడీపీని కాదని.. బీజేపీ వైసీపీ తో చేయి కలిపి... ఇప్పుడు చెప్పిన సోది... హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితిలో అయితే జనం లేరు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి మే వరకూ టైం తీసుకున్నట్టు వినికిడి. మరి అందుకేనేమో చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అన్నది. అంత ముందు చూపుతో ఆలోచిస్తారు కాబట్టే ఆయనకు ఆపేరు వచ్చింది.