చంద్రాల సారూ కాస్త మారండి...!

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు కనుక పని విషయంలో కాస్త నిర్లక్ష్యం చేసినా వారికి క్లాసుల మీద క్లాసులు పీకుతారన్న సంగతి తెలిసిందే. ఒక్క అధికారులే కాదు... మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుతో క్లాసుల పీకించుకున్న వాళ్లే. అందుకే ఏదన్న సమావేశాలు ఉన్నాయన్న.. టెలీ కాన్ఫరెన్స్ లు అన్నా చంద్రబాబు ఎక్కడ తిడతారో అని.. భయపడిపోతుంటారు. అయితే ఇప్పుడు ఓ విషయంలో కూడా అధికారులు చంద్రబాబు అంటే భయపడిపోతున్నారట. అదే చంద్రబాబు రివ్యూల గురించి. పోలవరం రివ్యూలైతేనేం, CRDA రివ్యూలైతేనేం అరగంటలో అవ్వాల్సిన రివ్యూలకు.. చంద్రబాబు ఆరు గంటలు తీసుకుంటున్నారట. అందుకే చంద్రబాబు రివ్యూలంటేనే అధికారుల దగ్గర నుండి ప్రతిఒక్కరు అంతలా బెంబేలెత్తిపోతున్నారు. బాబు రివ్యూలతో అధికారులలో విసుగెత్తిపోయారు. రివ్యూలలో ఉపన్యాసమే తప్ప సారం లేదంటున్నారు అధికారులు. అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి కట్టి పడేయడం వల్ల వారు మరొక పనిమీద దృష్టిపెట్టలేకపోతున్నారట.

 

రివ్యూలు ఇవ్వడం ఓకే కానీ దానికి ఒక పద్దతి ఉంది అంటున్నారు. గుండు సూది నుండి ప్రొక్లెయిన్ వరకూ అన్నితానే చూసుకుంటే ఇంక అధికారులు ఎందుకు.. వాళ్లు చేయడానికి ఏముంటుంది. అని విషయాలు చూడాలి.. సమీక్షించాలి తప్పులేదు.. ఎక్కడైనా మేనేజ్ మెంట్ డెలిగేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్థాయిని విభజించుకుంటూ అధికారులను కేటాయించాల్సి ఉంటుంది. అసలే చంద్రబాబు తలపెట్టింది మహాయజ్ఞం. అలాంటి యజ్ఞాన్ని పూర్తి చేయాలంటే బాబు తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి పని వారికి అప్పగించి మేజర్  థింగ్స్ ఆయన చూసుకుంటే పనులు కూడా తొందరగా అవుతాయి అంటున్నారు. ప్రాజెక్ట్స్ షెడ్యూల్స్ రీచ్ అయినయా..? లేదా..? జరగాల్సిన పనులు ఎందుకు జరగలేదు.. ఎక్కడ జరగడంలేదు..? అన్న విషయాలను మాత్రం తాను చూసుకుంటూ... మిగిలిన పనులకు ఎక్కడికక్కడ అధికారులను పట్టేస్తే సరిపోతుంది. మరీ అంత మైక్రో డిటైల్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇక ఈ హింస చూసిన చాలా మంది ప్రముఖ కాంట్రాక్టర్లు, హైటెక్ సిటీని నిర్మించిన ఎల్ఎన్టీ లాంటి కాంట్రాక్టర్లే రివ్యూలకు అటెండ్ అవ్వడానకి భయపడుతున్నారు. ఈ రివ్యూలకు భయపడి సీఎం రమేష్ తమ్ముడు హాజరుకాకపోవడం వల్ల.. బాబుతో తిట్లు తినాల్సి వచ్చింది. మరి బాబు ఇలానే ఉంటే అయ్యే పనులు కాదు కదా.. అవ్వాల్సిన పనులు కూడా అవ్వవని అధికారులు మొత్తుకుంటున్నారు. బాబుగారు ఇప్పటికైనా మారకపోతే.. అమరావతి లాంటి రాజధానిని కట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి...