బాలయ్యను రంగంలోకి దింపనున్న బాబు
Published on: Sat Dec 17, 2011 8:35AM
హై
దరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఉపఎన్నికల ప్రచారానికి తన బావమరిది, సినీ హీరో బాలకృష్ణను రంగంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఉప ఎన్నికలను చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉప ఎన్నికల్లో సత్తా చాటి, దాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. దాంతో అనుకుంటున్నారు. బాలకృష్ణ ఉప ఎన్నికల ప్రచారంలో పెద్ద యెత్తున పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. శ్రీరామరాజ్యం విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ ఇమేజ్ మరింత పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 26 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇది మినీ సాధారణ ఎన్నికల సమరాన్ని తలపించే అవకాశాలున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను తీవ్రంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నారు. దీంతో ఈ రెండు పార్టీలను దెబ్బ తీస్తూ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి బాలకృష్ణ ప్రచారం అవసరమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బాలకృష్ణ ప్రచారం ఉంటుందా, లేదా అనేది తెలియదు.


