TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజాద్‌ను వదిలి చంద్రబాబును ప్రశ్నిస్తే ఎలా

Published on: Fri Jan 6, 2012 3:37PM

వరంగల్: చంద్రబాబు టూర్‌ను తెలంగాణలో అడ్డుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ఇవ్వగలిగిన జాతీయ కాంగ్రెస్ నేత ఆజాద్‌ను వదిలిపెట్టి చంద్రబాబును ప్రశ్నిస్తే ఉపయోగం ఏంటని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు కలిసి ఆజాద్‌ లాంటి నేతలను - కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉందని నారాయణ తెలిపారు .


కాగా, ఒకరిద్దరు అడ్డుపడ్డంత మాత్రాన రైతుపోరుయాత్ర ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. యాత్రను టీఆర్‌ఎస్‌ అడ్డుకోవాలని చూడటం రాజకీయ లబ్దికోసమేనని విమర్శించారు. తెలంగాణపై తమ నిర్ణయాన్ని ఎప్పుడో ప్రకటించామన్నారు. రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. తెలంగాణప్రాంత అన్నదాతల కష్టాలపై పోరాడుతానంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మాప్రతినిధి లెనిన్‌ ఫేస్‌ టు ఫేస్‌.