TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రబెల్లి ఇంటికి నిప్పు..తెలంగాణలో నిరసనల వెల్లువ

Published on: Fri Jan 6, 2012 2:16PM

హైదరాబాద్: చంద్రబాబు పర్యటనకు తెలంగాణ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావే కారణమంటూ హన్మకొండలోని ఆయన ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటనలో ఆయన ఇంట్లోని ఫర్నీచర్, చంద్రబాబు ఫ్లెక్సీలు దగ్ధమయ్యాయి. కొందరు దుండగులు ఆయన ఇంటి పైకి పెట్రోల్ బాటిల్ విసిరి నిప్పు పెట్టారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్ పర్యటనపై తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాబు టూర్‌పై కరీంనగర్‌ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు శునకం మెడలో మోత్కుపల్లి ఫ్లకార్డు వేలాడదీసి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించని బాబుకు ఈ ప్రాంతంలో తిరిగే హక్కు లేదని మండిపడ్డారు.