బాబు కరీంనగర్ యాత్ర లక్ష్మికాంతారావు గృహనిర్భంధం
Published on: Tue Dec 27, 2011 9:30AM
వరంగ
ల్: చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుబాట యాత్రను మంగళవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ యాత్రను అడ్డుకుని తీరుతామని తెలంగాణ వాదులతో పాటు తెరాస నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా యాత్ర జరిగి తీరుతుందని తెదేపా శ్రేణులు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు యాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గం లంబాడిపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడతారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. ఇదిలావుండగా, చంద్రబాబు నాయుడును తెలంగాణలో తిరుగనీయకూడదు... జై తెలంగాణ అంటేనే చంద్రబాబును తెలంగాణ జిల్లాలో తిరుగనిస్తామని తెలంగాణ జేఏసీ, తెలంగాణవాదులు విస్పష్టంగా పిలుపునిచ్చారు.
కాగా, చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటారన్న కారణంతో వరంగల్, కరీంనగర్ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్‌ఎస్ నేత కెప్టెన్ లక్ష్మికాంతారావును పోలీసులు గృహనిర్భంధం చేశారు. వరంగల్ జిల్లాలో 150 మంది టీఆర్‌ఎస్ నేతలకు పోలీసులు నోటీసుల్ని జారీ చేయగా, హుస్నాబాద్‌లో 8 మంది జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును అడ్డుకుంటే క్రిమినల్ కేసుల్ని నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.


