TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపఎన్నికలకు కాదు మధ్యంతరానికే బాబు సన్నద్దం

Published on: Sun Dec 18, 2011 8:29AM

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఉపఎన్నికలకు కాకుండా మధ్యంతర ఎన్నికలకే సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నారు. శనివారం ఆయన తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిన సంకేతాలను బట్టి చూస్తే ఇదే నిజమేమో అనిపించక మానదు. చంద్రబాబు మాట్లాడుతూ.. చిరంజీవి పార్టీ పీఆర్పీ కాంగ్రెస్ కంపుతో చేరి పట్టించుకునే నాధుడు లేక విలవిలలాడుతోందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితిలో కిరణ్ సర్కార్ కూలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పుకొస్తున్నారు. ఉపఎన్నికలు కాదు.. మధ్యంతర ఎన్నికలు సైతం ఎప్పుడైనా రావచ్చని కార్యకర్తలకు ఆయన సూచనలు చేస్తున్నారు. మొన్నటి అవిశ్వాస తీర్మానాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గట్టెక్కిన కిరణ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని బాబు వ్యాఖ్యానించడంపై పెద్ద చర్చనీయాంశమైంది.


ఇంకోవైపు ప్రభుత్వాన్ని నిలబెట్టిన పీఆర్పీకి పదువుల పందేరం విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి మోకాలడ్డుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి మించి పదవుల పందేరం చేపడితే పదవులు రాని ఎమ్మెల్యేల్లో అసంతృప్తి భగ్గుమంటుందనీ, అదే జరిగితే మరోసారి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో చిరంజీవికి ఎలాగోలా కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టి ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు ఏదో రకంగా తాయిలాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వాన్ని నెట్టుక రావాలన్న యోచనలో ప్రభుత్వం కిరణ్ సర్కార్ ఉన్నదన్న వార్తలు సైతం వినొస్తున్నాయి.